ఆంజనేయ స్వామి Lord Hanuman
రామ భక్తుడు, బల బుద్ధి ప్రదాత, తనను నమ్మిన వారికి అభయం ఇచ్చే దైవం. Devotee of Sri Rama, giver of strength and wisdom, protector of all who turn to him.
ఆంజనేయుడు ఎవరు?Who is Anjaneya?
అంజనాదేవి, కేసరి దంపతుల కుమారుడు ఆంజనేయుడు. వాయుదేవుని అనుగ్రహంతో జన్మించినందున ఆయనను వాయుపుత్రుడు, పవనసుతుడు అని కూడా పిలుస్తారు. రామాయణంలో ఆయన శ్రీరాముని పరమ భక్తుడు, సీతమ్మ జాడ కనుగొన్న రామదూత. Anjaneya is the son of Anjana and Kesari, born through the blessing of Vāyu, the wind god, which is why he is also called Vāyuputra and Pavanasuta. In the Rāmāyaṇa he is Sri Rama's greatest devotee and the messenger who found Sita.
- ఆంజనేయుడు
- అంజనాదేవి కుమారుడు Anjaneya: son of Anjana
- హనుమంతుడు
- బాల్యంలో దవడ (హనువు) కు దెబ్బ తగలడం వల్ల వచ్చిన పేరు Hanuman: named after the injury to his jaw (hanu) as a child
- మారుతి, వాయుపుత్రుడు
- వాయుదేవుని కుమారుడు Maruti, Vāyuputra: son of the wind god
- రామదూత
- శ్రీరాముని దూత Rāmadūta: Rama's messenger
రామాయణంలో ఆంజనేయుడుStories from the Rāmāyaṇa
వాల్మీకి రామాయణం ఆధారంగా, సంక్షిప్తంగా. Retold briefly from Vālmīki's Rāmāyaṇa.
-
సూర్యుని పండు అనుకున్న బాలుడుThe child who leapt for the sun
చిన్నతనంలో ఉదయిస్తున్న సూర్యుని ఎర్రని పండుగా భావించి ఆంజనేయుడు ఆకాశంలోకి ఎగిరాడు. ఇంద్రుని వజ్రాయుధం దవడకు తగిలి కింద పడ్డాడు. అప్పటి నుంచి "హనుమంతుడు" అనే పేరు వచ్చింది. దేవతలు ఆయనకు ఎన్నో వరాలు ఇచ్చారు. As a child he saw the rising sun, took it for a ripe fruit and leapt into the sky. Indra's thunderbolt struck his jaw and he fell, which gave him the name Hanuman. The gods then blessed him with many boons.
Kiṣkindhā Kāṇḍa, sarga 66
-
శ్రీరామునితో తొలి కలయికFirst meeting with Sri Rama
ఋష్యమూక పర్వతం దగ్గర, సుగ్రీవుని పంపున, భిక్షువు (సన్యాసి) వేషంలో రామలక్ష్మణులను కలిశాడు. ఆయన మాట విని, "ఋగ్వేద, యజుర్వేద, సామవేదాలు తెలిసినవాడు, వ్యాకరణం క్షుణ్ణంగా చదివినవాడు మాత్రమే ఇలా ఒక్క తప్పు లేకుండా మాట్లాడగలడు" అని శ్రీరాముడు లక్ష్మణునితో మెచ్చుకున్నాడు. ఆ రోజు నుంచి ఆయన జీవితం రామ సేవకే అంకితమైంది. Near Ṛṣyamūka hill, sent by Sugrīva, he met Rama and Lakshmana disguised as a wandering ascetic. Rama told Lakshmana that only someone who knew the Ṛg, Yajur and Sāma Vedas and had mastered grammar could speak at such length without a single error. From that day his life was given to Rama's service.
Kiṣkindhā Kāṇḍa, sarga 3
-
సముద్ర లంఘనంThe leap across the ocean
సీతమ్మను వెదుకుతూ వానరులు సముద్ర తీరం చేరినప్పుడు, జాంబవంతుడు హనుమంతునికి ఆయన శక్తిని గుర్తు చేశాడు. మహేంద్ర పర్వతం ఎక్కి, అక్కడి నుంచి ఆకాశ మార్గాన నూరు యోజనాల సముద్రాన్ని దాటాడు. దారిలో మైనాక పర్వతం, సురస, సింహిక ఎదురైనా లంక చేరాడు. When the search for Sita reached the shore, Jāmbavān reminded Hanuman of his own strength. He climbed Mount Mahendra and from there flew across a hundred yojanas of ocean, meeting Maināka, Surasā and Siṃhikā on the way, and reached Lanka.
Kiṣkindhā Kāṇḍa 66–67; Sundara Kāṇḍa 1
-
సీతమ్మ దర్శనంFinding Sita
అశోకవనంలో దుఃఖంలో ఉన్న సీతమ్మను కనుగొని, శ్రీరాముని ఉంగరాన్ని ఆమెకు అందించి ధైర్యం చెప్పాడు. సీతమ్మ తన చూడామణిని రాముడికి గుర్తుగా ఇచ్చి పంపింది. In the Aśoka grove he found Sita in grief, gave her Rama's ring and told her help was coming. Sita sent back her chūḍāmaṇi jewel as a sign for Rama.
Sundara Kāṇḍa, sargas 36 and 38
-
లంకా దహనంLanka in flames
రావణుని ఆజ్ఞతో రాక్షసులు హనుమంతుని తోకకు నిప్పు పెట్టారు. ఆ మండుతున్న తోకతోనే ఆయన లంకను దహనం చేశాడు. సీతమ్మ ప్రార్థనతో అగ్ని ఆయనను బాధించలేదు. On Rāvaṇa's orders his tail was set on fire. With that burning tail he set Lanka ablaze, and through Sita's prayer the fire did not harm him.
Sundara Kāṇḍa, sargas 53–54
-
సంజీవని పర్వతంThe mountain of herbs
రావణుని శక్తి ఆయుధం తగిలి లక్ష్మణుడు పడిపోయినప్పుడు, వానర వైద్యుడు సుషేణుని మాటపై ప్రాణం పోసే మూలికల కోసం హిమాలయాలకు వెళ్ళాడు. ఏ మూలికో గుర్తించలేక ఆ పర్వత శిఖరాన్నే పెకలించి తెచ్చాడు. వాల్మీకి రామాయణంలో హనుమంతుడు ఇలా రెండుసార్లు ఓషధి పర్వతాన్ని తెచ్చాడు. When Lakshmana was struck down by Rāvaṇa's spear, the monkey physician Suṣeṇa sent Hanuman to the Himalayas for life-giving herbs. Unable to tell which ones they were, he broke off the whole mountain peak and carried it back. In Vālmīki's telling, Hanuman brings a mountain of herbs twice.
Yuddha Kāṇḍa, sargas 74 and 101
-
చిరంజీవిThe immortal devotee
రాముని కథ భూమి మీద చెప్పబడినంత కాలం తాను జీవించి ఉండాలని హనుమంతుడు కోరుకున్నాడు. శ్రీరాముడు ఆ వరం ఇచ్చాడు. అందుకే రామ నామం వినిపించే ప్రతి చోటా ఆయన ఉంటాడని భక్తుల నమ్మకం. Hanuman asked to live for as long as Rama's story is told on earth, and Rama granted it. That is why devotees believe he is present wherever Rama's name is sung.
Uttara Kāṇḍa, sarga 40 (many scholars consider the Uttara Kāṇḍa a later addition to Vālmīki's text)
ఆంజనేయుని గుణాలుHis qualities
- బలం Strength
- పర్వతాలను ఎత్తగల, సముద్రాలను దాటగల శక్తి. Strength enough to lift mountains and cross oceans.
- బుద్ధి Wisdom
- వేదాలు, వ్యాకరణం తెలిసిన పండితుడు, సమయానికి తగిన నిర్ణయం తీసుకునే వివేకం. A scholar of the Vedas and grammar, with the judgement to act rightly at the right moment.
- అభయం Fearlessness
- తాను భయపడడు, తనను నమ్మిన వారిని భయం నుంచి కాపాడతాడు. మన స్వామి పేరు ఈ గుణం నుంచే వచ్చింది. He knows no fear and frees his devotees from it. Our Swamy is named for this quality.
- భక్తి Devotion
- ప్రతి పనీ శ్రీరాముని సేవగానే చేశాడు. Every deed he did, he did as service to Rama.
- వినయం Humility
- అంత శక్తి ఉన్నా, లంకలో "నేను కోసల రాజైన శ్రీరాముని దాసుడను" అని మాత్రమే ప్రకటించుకున్నాడు. For all his power, in Lanka he declared himself simply "the servant of Rama, king of Kosala" (dāso'haṁ kosalendrasya).
దివ్య గదThe divine gada
ఆలయ విగ్రహాలలో, చిత్రాలలో ఆంజనేయ స్వామి చేతిలో గద కనిపిస్తుంది. భక్తులు దానిని బలానికి, ధైర్యానికి, ధర్మ రక్షణకు ప్రతీకగా భావిస్తారు. In temple idols and paintings, Anjaneya is shown holding a gada (mace). Devotees see it as a sign of strength, courage and the protection of dharma.
- మన స్వామి వారి ఎడమ చేతిలో కూడా గద ఉంది. Our Swamy at Ganjivaripalli also holds a gada, in his left hand.
- వాల్మీకి రామాయణంలో యుద్ధంలో హనుమంతుడు ఎక్కువగా చెట్లు, బండరాళ్లు, తన పిడికిలితోనే పోరాడాడు. గద ధరించిన రూపం తరువాతి సంప్రదాయంలో, శిల్ప కళలో ప్రసిద్ధి. సంప్రదాయం · tradition In Vālmīki's Rāmāyaṇa, Hanuman fights mostly with trees, boulders and his bare hands. His image with a gada comes from later tradition and temple art.
The gada shown here is an artistic illustration.
ఆంజనేయ స్వామి పూజHow devotees worship him
సంప్రదాయం అని గుర్తించినవి భక్తులలో ప్రచారంలో ఉన్న ఆచారాలు, రామాయణంలోనివి కావు. Items marked "tradition" are popular customs among devotees, not events from the Rāmāyaṇa.
-
శనివారం, మంగళవారంSaturdays and Tuesdays సంప్రదాయం · tradition
ఆంజనేయ స్వామికి ప్రత్యేక దినాలు. శనివారం స్వామిని పూజిస్తే శని బాధలు తొలగుతాయని భక్తుల నమ్మకం. మన ఆలయంలో ప్రతి శనివారం స్వామి వారికి అభిషేకం, పూజ జరుగుతాయి. His special days. Devotees believe worshipping him on Saturday eases the troubles of Shani (Saturn). At our temple the priest performs abhishekam and puja every Saturday.
-
సింధూరం, తమలపాకులు, వడమాలSindoor, betel leaves, vada garlands సంప్రదాయం · tradition
స్వామికి సింధూరం పూయడం, తమలపాకుల మాల, వడమాల సమర్పించడం భక్తులకు ఇష్టమైన మొక్కులు. Offering sindoor, a garland of betel leaves or a garland of vadas are among the best-loved offerings to him.
-
సుందరకాండ పారాయణంReading the Sundara Kāṇḍa సంప్రదాయం · tradition
సీతమ్మను వెదికిన హనుమంతుని కథ ఉన్న సుందరకాండను తెలుగు ఇళ్ళలో భక్తితో పారాయణం చేస్తారు. The Sundara Kāṇḍa, the book of the Rāmāyaṇa that tells how Hanuman found Sita, is read with devotion in Telugu homes.
-
హనుమాన్ చాలీసాHanuman Chalisa
16వ శతాబ్దపు కవి గోస్వామి తులసీదాసు అవధీ భాషలో రచించినదిగా ప్రసిద్ధమైన, నలభై చౌపాయిల స్తోత్రం. ప్రపంచమంతా భక్తులు దీనిని పఠిస్తారు. A hymn of forty verses (chaupāīs) in Awadhi, traditionally attributed to the 16th-century poet Goswami Tulsidas, recited by devotees all over the world.
-
హనుమాన్ జయంతిHanuman Jayanti
స్వామి జన్మదినం. తెలుగు రాష్ట్రాల్లో వైశాఖ బహుళ దశమి నాడు జరుపుకుంటారు. చైత్ర పౌర్ణమి నుంచి 41 రోజుల హనుమాన్ దీక్ష ఈ రోజుతో ముగుస్తుంది. ఉత్తర భారతంలో చైత్ర పౌర్ణమి నాడే జరుపుకుంటారు. మన ఆలయంలో ఇది ముఖ్య పండుగ, భక్తులు భారీగా వస్తారు. His birthday. In Andhra Pradesh and Telangana it falls on Vaiśākha Bahula Daśamī (the tenth day of the waning moon in Vaiśākha), which also ends the 41-day Hanuman Dīkṣā that begins on Chaitra Pūrṇimā. North India celebrates it on Chaitra Pūrṇimā itself. It is one of the main festivals at our temple, and large crowds come.
హనుమాన్ చాలీసా పఠించండి Recite the Hanuman Chalisa in Telugu, English letters or Devanagari, with the meaning of every verse
అభయ ఆంజనేయ స్వామిని దర్శించుకోండిCome for darshan
గంజివారిపల్లిలో 13 అడుగుల ఏకశిలా ఆంజనేయ స్వామి. ప్రతి రోజు ఉదయం 6 నుంచి రాత్రి 8 వరకు దర్శనం. The 13-foot monolithic Anjaneya at Ganjivaripalli. Open every day, 6 AM to 8 PM.
కథలు వాల్మీకి రామాయణం ఆధారంగా సంక్షిప్తంగా రాయబడ్డాయి. The stories are short retellings based on Vālmīki's Rāmāyaṇa (Kiṣkindhā, Sundara, Yuddha and Uttara Kāṇḍas). Sarga numbers follow the common Gita Press edition and can differ slightly in other editions. Customs marked "tradition" are widely followed practices, not scripture.